గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 03:41:38

చేపల వేటకు వెళ్లి.. వాగులో చిక్కి..

చేపల వేటకు వెళ్లి.. వాగులో చిక్కి..

భైంసా టౌన్‌: నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామ వాగులో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులను స్థానికులు రక్షించారు. మంగళవారం దేగాం గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు గురు(9), పోశెట్టి(9), పాపన్న(10) చేపల వేట కోసం వాగుకు వెళ్లారు. ఒక్కసారిగా వాగు ఉప్పొంగడంతో అక్కడే ఓ ఎత్తయిన బండ రాయిపైకి చేరుకున్నారు. ఒడ్డున ఉన్న మరో బాలుడి ద్వారా విషయం తెలుసుకున్న వీడీసీ అధ్యక్షుడు కిష్టయ్య ముదిరాజ్‌ ఈదుకుంటూ వెళ్లి ముగ్గురిని రక్షించేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతి కారణంగా సాధ్యం కాలేదు. స్థానికులు వెంటనే జేసీబీని తెప్పించి వారిని బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


logo