శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 22:20:02

దుండిగల్‌లో తండ్రితో సహా ముగ్గురు పిల్లలు అదృశ్యం

దుండిగల్‌లో తండ్రితో సహా ముగ్గురు పిల్లలు అదృశ్యం

మెడ్చల్‌ :  మెడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో తండ్రితో సహా ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ మజీద్‌ (29) పదేళ్ల క్రితం ఏస్తేరు అనే యువతిని వివాహం చేసుకున్నాడు.  కొనేండ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి న కుత్బుల్లాపురంలోని సురారం కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి షేక్‌ వాహిద్‌ (9), వజీద్‌ (5), నటాయా (2) ముగ్గరు పిల్లలు.  మజీద్‌ కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసైన అతడు భార్యను వేధిస్తూ తరచూ గొడవపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం దంపతుల నడుమ గొడవ జరగడంతో పిల్లలను తీసుకొని బయటకు వెళ్లిన మజీద్‌ తిరిగి రాలేదు. భార్య తమ బంధువు, తెలిసిన వారి వద్ద ఆరా తీసిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.