ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 16:34:48

తొల్సూరు కాన్పులో.. మూడింతల సంతోషం!

తొల్సూరు కాన్పులో.. మూడింతల సంతోషం!

మహబూబ్ నగర్ : సాధారణంగా ప్రస్తుత కాలంలో ఒక్క డెలివరీ చేయాలంటేనే ప్రైవేట్ హాస్పిటల్లలో నార్మల్ డెలివరీ చేయకుండా దాదాపుగా సిజేరియన్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సుఖ ప్రసవాలకు ప్రాధాన్యమిస్తూ కాన్పు చేస్తుండటం విశేషం. తాజగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో నారాయణపేట పట్టణం పళ్ళ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ప్రసవించగా.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు.

ఆవిడకు అక్కడి వైద్యులు సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీతో పురుడు పోశారు. వీరిలో ఇద్దరు బాబులు, ఒక పాప ఉన్నారు. ముగ్గురు పిల్లలు, తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న చక్కని వైద్య సేవలకు ఈ ప్రసవం ఒక ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు.  


logo