శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 02:33:34

గ్రీన్‌ చాలెంజ్‌లో వెయ్యి మొక్కలు

గ్రీన్‌ చాలెంజ్‌లో వెయ్యి మొక్కలు

  • శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రారంభించిన ఎంపీ సంతోష్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హరితహారం, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం వెయ్యి మొక్కలు నాటారు. జీఎంఆర్‌ సంస్థ, సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ మొక్క నాటారు. జీఎంఆర్‌ సంస్థ, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో జీఎంఆర్‌ విమానాశ్రయ సీఈవో మదన్‌కుమార్‌సింగ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీ భరత్‌కుమార్‌, సెక్యూరిటీ చీఫ్‌ ఆఫీసర్‌ కమథర్‌ పాల్గొన్నారు. 


logo