బుధవారం 27 మే 2020
Telangana - May 05, 2020 , 06:19:50

రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారు ఈ విధంగా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారు ఈ విధంగా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

హైద‌రాబాద్‌:   మార్చ్ 22న విధించిన జ‌న‌తా క‌ర్ఫ్యూ అనంత‌రం విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు, బంధువులు తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయారు. వారితో పాటు ఉద్యోగాల కోసం ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారు, కూలీలు ఇక్క‌డే ఉండిపోయారు. పెండ్లీల కోసం వ‌చ్చి బంధువ‌ల ఇంట్లో చాలా మంది లాక్‌డ‌న్ కార‌ణంగా సొంత‌ప్రాంతాల‌కు వెళ్ల‌లేక‌పోయారు. వారి కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ పాస్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. పైన తెలిపిన బాధితులు ఉంటే స్థానిక అంటే మీరు ఉండిపోయిన పోలీస్‌స్టేష‌న్ ప్రాంతంలో ఈ పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్ కోసం tsp.koopid.ai./epass లింక్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ప‌రిశీలించిన స్థానిక పోలీసులు బాధితుల‌కు పాస్‌లు జారీచేస్తారు. చాలా మంది ఒకే సారి ద‌ర‌ఖాస్తు చేయ‌డం వ‌ల్ల స‌ర్వ‌ర్ బిజీగా ఉంద‌ని, రెండు రోజుల్లో దాన్ని స‌రిచేస్తామ‌ని పోలీసు అధికారులు తెలిపారు. పాస్ జారీ ప్రారంభ‌మైన తొలిరోజు ఆదివారం 7,749 మంది ద‌ర‌ఖాస్తు చేశారు. దీంతో నిన్న సోమ‌వారం స‌ర్వ‌ర్ బిజీ రావ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. సాంకేతిక ఇబ్బందుల త‌లెత్త‌డంతో పాస్‌ల జారీ అల‌స్యం అయింద‌ని, రెండు రోజుల్లో ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌ని పేర్కొన్నారు. 


logo