శనివారం 29 ఫిబ్రవరి 2020
ఈ నెలాఖరుకు సెల్ఫీ డ్రైవింగ్‌ లైసెన్సు..

ఈ నెలాఖరుకు సెల్ఫీ డ్రైవింగ్‌ లైసెన్సు..

Feb 15, 2020 , 07:30:36
PRINT
ఈ నెలాఖరుకు సెల్ఫీ డ్రైవింగ్‌ లైసెన్సు..

హైదరాబాద్: కార్యాలయాలకు రాకుండానే సేవలు పొందేలా రవాణాశాఖ సమాయత్తమవుతున్నది. ఇప్పటివరకు ప్రతీసేవకు ఆర్‌టీవో కార్యాలయాలకు వచ్చి క్యూలో నిలబడి పొందే సేవలు ఒకొక్కటిగా మరింత సులభతరమవుతున్నాయి. అందులోభాగంగానే డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యూవల్‌ కోసం కార్యాలయాని కి రావాల్సిన అవసరం లేకుండానే రెన్యూవల్‌ చేసుకోవచ్చు. ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి సెల్ఫీ దిగి రవాణాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా లైసెన్సు రెన్యూవల్‌ చేసి కార్డును దరఖాస్తుదారుడి ఇంటికి పంపిస్తారు. ఈ విధానాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు అందుబాటులోకి తేనున్నారు. ఈ విషయాన్ని రవాణాశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ కూడా సిద్ధమైనట్లు తెలిపారు.  కూర్చున్న దగ్గర కంప్యూటర్‌ లేదా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా రవాణాశాఖ సేవకు సంబంధించి వివరాలు, ఫోటో అప్‌లోడ్‌ చేస్తే చాలు కొద్ది నిమిషాల్లో రెన్యూవలైన లైసెన్సు ప్రత్యక్షమవుతుంది. కార్డు వారం రోజుల్లో అందుతుంది. ఇప్పటికే ఫ్యాన్సీనంబర్లు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా దక్కించుకునే సదుపాయాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా రవాణాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఇదేబాటలో లైసెన్సు రెన్యువల్‌ సేవలను తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో లెర్నింగ్‌ లైసెన్సుతోపాటు, ఇతర సేవలన్నీ కార్యాలయానికి రాకుండానే పొందే వీలుంది. logo