ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 01:06:32

ఆన్‌లైన్‌ పాఠాల టైంటేబుల్‌ ఇదే..

ఆన్‌లైన్‌ పాఠాల టైంటేబుల్‌ ఇదే..

  • టెన్త్‌, ఇంటర్‌ ఆన్‌లైన్‌ పాఠాలబోధన 
  • షెడ్యూల్‌ విడుదలచేసిన విద్యాశాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  రాష్ట్రంలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి పాఠశాల విద్యార్థులకు ప్రారంభం కానున్న డిజిటల్‌ పాఠాల బోధన టైంటేబుల్‌ విడుదలైంది. ఆయా తరగతులకు డిజిటల్‌ పాఠాలు ప్రసారమయ్యే సమయాన్ని బట్టి విద్యార్థులను సన్నద్ధ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రసారాల టైంటేబుల్‌ సెప్టెంబర్‌ 14 వరకు మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత ప్రసారాల కోసం మరోసారి టైంటేబులు విడుదల చేయనున్నారు.  

ఇంటర్‌ డిజిటల్‌ పాఠాలు.. సెప్టెంబర్‌ 1 నుంచి ఇంటర్‌ ద్వితీ య సంవత్సరం విద్యార్థులకు దూ రదర్శన్‌ యాదగిరి చానెల్‌ ద్వారా డిజిటల్‌ పాఠాలను ప్రసారం చేయనున్నారు. మొదటి రెండు వారా లు అంటే సెప్టెంబర్‌ 1 నుంచి 12 వరకు టైంటేబుల్‌ తయారుచేశా రు. ప్రతిరోజు ఉదయం, మధ్యా హ్నం రెండు పూటలూ డిజిటల్‌ పాఠాలు ప్రసారం చేయనున్నట్టు ఇంటర్‌ విద్యా కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు.  
logo