బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 12:51:31

ప్రజా సమీకరణ సమయం కాదు.. కరోనాపై పోరాట సమయం

ప్రజా సమీకరణ సమయం కాదు.. కరోనాపై పోరాట సమయం

హైదరాబాద్‌ : ప్రస్తుత కాలం కరోనాపై పోరాట సమయమని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీపీ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి మనమంతా కలిసి పనిచేయాలన్నారు. ఏ సంఘటన పైనైనా, ఏ అంశంపైనైనా ఎటువంటి ర్యాలీ, సమావేశాలు కావడం చేయొద్దన్నారు. ఇది కరోనాపై పోరాట సమయమని ప్రజా సమీకరణకు సమయం కాదన్నారు. ఈ అంశంలో నాయకులందరూ సహకరించాల్సిందిగా సూచించారు. లేకపోతే కేసులు నమోదు అవుతాయన్నారు.


logo