శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 18:32:24

20 ఏళ్లలో ఇదే అత్యధికం

20 ఏళ్లలో ఇదే అత్యధికం

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ ఓటింగ్‌ శాతాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ బుధవారం అధికారికంగా ప్రకటించారు. గ్రేటర్‌లో 149 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ శాతాన్ని వెల్లడించారు. 46.68 ఓటింగ్‌ శాతం నమోదైనట్లు ఆయన వెల్లడించారు. కంచన్‌బాగ్‌లో అత్యధికంగా 70.39 శాతం నమోదవగా యూసఫ్‌గూడలో అత్యల్పంగా 32.99 శాతం నమోదైందన్నారు. గత 20 ఏళ్లలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈసారే అత్యధిక ఓటింగ్‌ నమోదైనట్లు పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో 42.04 శాతం, 2016లో 45.29 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు తెలిపారు. గతంలోకంటే ఈ ఎన్నికల్లో 1.31 శాతం పోలింగ్‌ పెరిగిందన్నారు. 

గ్రేటర్‌ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకుగాను 149 డివిజన్లలో మంగళవారం పోలింగ్‌ జరిగింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో ఎన్నికల గుర్తులు తారుమారు కావడంతో అక్కడ ఎన్నికలు వాయిదాపడ్డాయి. గురువారం ఓల్డ్‌ మలక్‌పేట్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 4నే ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. 


logo