సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 13:17:53

ఇది రైతు ప్రభుత్వం : మంత్రి హరీశ్‌రావు

ఇది రైతు ప్రభుత్వం : మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ : తమ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని.. ఇది రైతు ప్రభుత్వం అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి నేడు క్షేత్రస్థాయిలో పర్యటించారు. పర్యటన సందర్భంగా మంత్రి శివంపేట మండలం కొత్తపేట, రత్నాపూర్‌ గ్రామాల్లో నిర్మించిన డంపింగ్‌యార్డ్‌లను ప్రారంభించారు. అంతకుక్రితం కొత్తపేట గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రత్నాపూర్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు.

పర్యటన సందర్భంగా మంత్రి పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులను కలిసి మాట్లాడారు. రైతుబంధు అందిందా లేదా అని ఆరా తీశారు. నియంత్రిత సాగు వల్ల రైతులకు కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo