ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 01:44:23

దాశరథి అవార్డుకు తిరునగరి

దాశరథి అవార్డుకు తిరునగరి

  • ఎంపికచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఐదున్నర దశాబ్దాలుగా సాహిత్య సేవలో
  • రేడియో, దూరదర్శన్‌కు వందల భక్తిగీతాలు
  • అనేక ప్రసంగాల ద్వారా గొప్పవక్తగా ఖ్యాతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ర్టానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారానికి ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా దాశరథి పేరిట సాహితీ పురస్కారాన్ని అందజేస్తున్నది. ఈ పురస్కారానికి అర్హులను ఎంపికచేసేందుకు ఈ 

నెల 18న తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ సమావేశమైంది. తిరునగరి రామానుజయ్య పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపింది. కమిటీ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించినట్టు యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌ కల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు తెలిపారు. అవార్డుగ్రహీతకు పురస్కారంతోపాటు రూ.1,01,116 నగదు, షీల్డు, శాలువాను బహూకరిస్తారని పేర్కొన్నారు.

ఐదున్నర దశాబ్దాల సాహితీ సేవ

తిరునగరి రామానుజయ్య ఐదున్నర దశాబ్దాలుగా సాహితీరంగానికి ఎనలేని సేవచేస్తున్నారు. 1945లో యాదాద్రి భువనగిరి జిల్లా బేగంపేటలో జన్మించిన ఆయన.. ఆలేరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. మూడు దశాబ్దాలపాటు ఉపాధ్యాయుడిగా, లెక్చరర్‌గా బోధనారంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 30కిపైగా గ్రంథాలు రాశారు. అటు ప్రాచీన సాహిత్యానికి ఇటు ఆధునిక కవిత్వానికి వా రధిలా నిలిచారు. తిరునగరి సాహితీవేత్తగానే కాకుం డా.. తెలుగు, సం స్కృతం, హిందీ, ఇంగ్లిషు ప్రసంగాల ద్వారా గొప్పవక్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. కవిత్వం, పద్యం, విమర్శ, వ్యాఖ్యానం ఏదిరాసినా తనదైన శైలి క నబర్చారు. ఆయన ఆకాశవాణి, దూరదర్శన్‌కు వందల లలిత, ప్రభోదాత్మ క, దేశభక్తి గీతాలను రాశారు. అనేక సాహిత్య ప్రసంగాలు చేశారు. పలు సంస్థలు నిర్వహించిన సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా అధికార భాషా సంఘం సభ్యుడిగా ఉన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రముఖ సాహితీ పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు దాశరథి పురస్కారానికి తిరునగరిని ఎంపికకావడం పట్ల సాహితీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.logo