శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 04:05:47

నేడు ఆన్‌లైన్‌లో శ్రీవారి కల్యాణోత్సవ టికెట్లు

నేడు ఆన్‌లైన్‌లో శ్రీవారి కల్యాణోత్సవ టికెట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి కల్యాణోత్సవ సేవా టికెట్లను గురువారం నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఈ నెల 7 నుంచి 31 వరకు నిర్వహించే కల్యాణోత్సవ సేవలో భక్తులు ఆన్‌లైన్‌లో పాల్గొననున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవ సేవ ప్రారంభం కానున్నది. తొలి పదినిమిషాలు టికెట్లు కలిగిన భక్తులతో అర్చకులు సంకల్పం చెప్పించనున్నారు. ఇందులో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ సూచించింది. వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్ట్‌ ద్వారా భక్తుల ఇంటికి పంపిస్తామని వెల్లడించింది.

తిరుపతిలో 14 వరకు లాక్‌డౌన్‌ 

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తిరుపతిలో లాక్‌డౌన్‌ను 14వ తేదీ వరకు పొడిగించినట్టు మున్సిపల్‌ కమిషనర్‌ పీఎస్‌ గిరిష బుధవారం మీడియాకు వెల్లడించారు. అయితే.. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు షాపులకు అనుమతి ఉండేదని, ఇకనుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుచుకోవచ్చని పేర్కొన్నారు.


logo