ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 06, 2020 , 10:47:12

వైభవంగా భద్రాద్రి రాముని తిరుకల్యాణం

వైభవంగా భద్రాద్రి రాముని తిరుకల్యాణం

భద్రాచలం: భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గోదావరి నది నుంచి అర్చక స్వాములు తీర్థబిందలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావచనం, పరిషత్‌ దక్షణ, రక్షణ బంధనం నిర్వహించారు. మూలమూర్తుల వద్దకు వెళ్లి మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులు, నిత్యకల్యాణ మూర్తులు, పరివార దేవతలకు కంకణాలను అభిశేకించారు. ఆచార్య, బ్రహ్మ, రుత్వికులకు, ఆలయ అధికారులకు కంకణ ధారణ చేశారు. రాష్ట్రంలో కరోనా విస్తరిస్తుండటం ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ ఉత్సవాలకు సాధారణ భక్తులను అనుమతించలేదు. అదేవిధంగా నిత్య కల్యాణ మండపంలో స్వామివారి ఊంజల్‌ సేవ ఘనంగా నిర్వహించారు. కరోనా వైరస్‌ వల్ల ఈ ఏడాది స్వామి కల్యాణం కొద్ది మంది భక్తుల సమక్షంలోనే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నరసింహులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 


logo