గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:20:40

అతిగా శానిటైజర్‌తో ముప్పే

అతిగా శానిటైజర్‌తో ముప్పే

  • చర్మ వ్యాధులకు అవకాశం
  • సబ్బు, హ్యాండ్‌వాష్‌లే మేలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  వైరస్‌ కట్టడిలో కీలకంగా మారిన శానిటైజర్‌ను అవసరమైతేనే వాడాలి. పదేపదే వినియోగించడం ముప్పేనంటున్నారు వైద్యనిపుణులు. సబ్బు అందుబాటులో లేనప్పుడు మాత్రమే నాణ్యమైన శానిటైజర్‌ను చేతులకు రుద్దుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లిన సమయంలో ఏదేని వస్తువును, ఉపరితలాలను తాకినప్పుడు మాత్రమే శానిటైజర్‌ వాడాలి. ఇండ్లల్లో ఉన్నప్పుడు అసలు శానిటైజర్‌ జోలికి వెళ్లనవసరం లేదు. ఒకవేళ బయటినుంచి వచ్చిన వస్తువులను తాకినప్పుడు శానిటైజర్‌ కాకుండా సబ్బుతో చేతులను శుభ్రంచేసుకోవాలి.

శానిటైజర్ల వల్ల వచ్చే సమస్యలు

ఆహారానికి ముందు చేతులకు శానిటైజర్‌రాస్తే ఆల్కహాల్‌ కడుపులోకి వెళ్లి వాం తులు, విరేచనాలయ్యే ప్రమాదమున్నది. తరచూ శానిటైజర్లను వాడటం వల్ల చర్మం పొడిబారుతుంది. చర్మం పొట్టు పొట్టుగా మారి ఊడిపోతుందని చర్మవ్యాధి వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  


logo