హైదరాబాద్ : చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్కార్ గోవింద్రాజ్ తెలిపారు. కోటలో మూడో బోనం జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.