శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 16:55:12

రఘునందన్ రావును అడ్డుకున్న తిమ్మక్కపల్లి గ్రామస్తులు

రఘునందన్ రావును అడ్డుకున్న తిమ్మక్కపల్లి గ్రామస్తులు

సిద్దిపేట : బీజేపీ నాయకుడు రఘునందన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి ప్రచారానికి వెళ్లిన ఆయన ప్రసంగాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. శుక్రవారం గ్రామంలో మాట్లాడుతుండగా టీఆర్ఎస్ ను విమర్శించే వ్యాఖ్యలు చేయడంతో గ్రామస్తులు ఆయన స్పీచ్ ను అడ్డుకొని తీవ్ర వాగ్వాదానికి దిగారు. సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. బీజేపీ చేసిన ఘనత ఏమీ లేదని గ్రామస్తులు తేల్చిచెప్పడంతో సమాధానం చెప్పుకోలేక రఘునందన్ రావు గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇస్తుందని రఘునందన్ రావు చెప్పడంతో ఆగ్రహించిన గ్రామస్తులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో గ్రామం నుంచి వెళ్లిపోయారు. logo