గురువారం 02 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 21:26:56

ఈ మిడతలు ఆ మిడతలు కావు...

ఈ మిడతలు ఆ మిడతలు కావు...

కన్నెపల్లి : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నాయకన్‌పేట్‌ గ్రామ శివారులో మిడతలు వచ్చినట్లు కలకలం రేగడంతో గురువారం బెల్లంపల్లి కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు తిరుపతి, నాగరాజు వాటిని పరిశీలించారు. అవి ప్రమాదకరమైన మిడతలు కావని, సహజంగా గడ్డి మీద ఉండే కీటకాలని, ఎలాంటి ప్రమాదం లేదన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భీమిని ఏడీఏ ఇంతియాజ్‌, కన్నెపల్లి ఏవో శ్రీకాంత్‌, ఎస్‌ఐ ప్రశాంత్‌ రెడ్డి, సర్పంచ్‌ హంస ఉన్నారు.logo