గురువారం 04 జూన్ 2020
Telangana - May 09, 2020 , 13:11:32

వ్యాక్సిన్‌ కనుగొనేంతవరకు ఇదే జీవన విధానం : డీజీపీ

వ్యాక్సిన్‌ కనుగొనేంతవరకు ఇదే జీవన విధానం : డీజీపీ

హైదరాబాద్‌ : కోవిడ్‌-19 సంక్రమణకు గురికాకుండా రిస్క్‌ను తగ్గించుకునే మార్గాలను రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు వ్యాక్సిన్‌ కనుగొనేంత వరకు మన జీవన విధానంగా ఉండాలన్నారు. కోవిడ్‌-19 భారిన పడకుండా ఓ వ్యక్తి తనను తాను రక్షించుకునేందుకు వీటన్నింటిని పాటించాల్సిందిగా పేర్కొన్నారు.


logo