గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 19:47:58

ముందు జాగ్రత్తలు పాటిద్దాం..కరోనాను అరికడదాం!

ముందు జాగ్రత్తలు పాటిద్దాం..కరోనాను అరికడదాం!

హైదరాబాద్‌:  తెలంగాణలో కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో ప్రజలను అప్రమత్తం చేసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పోస్టర్‌ను విడుదల చేసింది. వైరస్‌ నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరచాలనాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం శ్రేయస్కరమని, ముఖ్యమైన సూచనలు పాటించాలని సూచించారు. 

'కరోనా వైరస్‌ గాలితో ఇతరులకు వచ్చే ఆస్కారం లేదు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ వచ్చిన వారిలో ౩శాతం కూడా మరణాలు లేవు. కరోనా వైరస్‌ ఉన్నవారు మాట్లాడినప్పుడు తుప్పిర్లు ముఖంపై పడితే వచ్చే అవకాశం ఉంది. వైరస్‌ వచ్చిన వ్యక్తి కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే అవకాశం ఉందని' మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.logo