శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 13:25:19

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌.. క్యూలైన్లలో జనాలు

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌.. క్యూలైన్లలో జనాలు

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా ముమ్మరంగా చర్యలు చేపట్టారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లతోపాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాపించకుండా ఏర్పట్లు చేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు.  వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాత మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు.  థర్మల్ స్క్రీనింగ్ మరియు సానీటైజ్ కోసము ప్రయాణికులు ఎండను సైతం లెక్కచేయకుండా లైన్ లో నిలబడుతున్నారు. స్టేషన్‌ లోపల పరిసరాలను కూడా రాసాయనాలతో శుభ్రపరిచి నీట్‌గా ఉంచుతున్నారు. logo