శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 20:21:53

ఓటుహక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి

ఓటుహక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి

సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లంతా ఓటుహక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం  కల్పించాలని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలోని  అన్ని మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించేలా స్వీప్ కార్యాచరణ నేటి సాయంత్రంలోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఓటర్లకు ఓటు ప్రాధాన్యం వివరించేలా సోషల్ మీడియా సహా ప్రసార మాధ్యమాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో చేసిన ప్రత్యేక ఏర్పాట్లను తెలియజేయాలని సూచించారు.

ఇండెంట్ ప్రకారం వాహనాలను సమకూర్చాలని జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వెబ్ కాస్టింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఈడీఎంలకు సూచించారు. బరిలో ఉన్న 23 మంది అభ్యర్థుల బ్యాంకు ఖాతాలను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేయాలని చెప్పారు. బందోబస్తు ప్రణాళికను రేపటిలోగా అందించాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కోరారు. మీడియాలో అనుమతులు లేకుండా వచ్చే ప్రకటనలు, వ్యయం అభ్యర్థుల ఖాతాల్లో జమయ్యేలా చూడలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ పద్మాకర్, శ్రీ ముజమిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీఓలు జయచంద్రా రెడ్డి, అనంత రెడ్డి , నోడల్ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు