గురువారం 28 మే 2020
Telangana - May 09, 2020 , 04:35:14

ఎరువుల కొరత ఉండొద్దు

ఎరువుల కొరత ఉండొద్దు

నిల్వలు క్షేత్రస్థాయికి చేరాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్‌ మొదలయ్యేనాటికి ఎరువులను సిద్ధంచేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హాకాభవన్‌లో ఆ శాఖ కార్యదర్శి  జనార్దన్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. రాష్ర్టానికి గతంలో కోరిన రేక్‌ పాయిం ట్లు వెంటనే మంజూరు చేయాలని రైల్వే అధికారులను కోరారు. రామగుండం ఎరువుల కార్మాగారం ప్రారంభానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. క్షేత్రస్థాయికి ఎరువుల నిల్వలు చేర్చాలని అధికారులను సూచించా రు. రేక్‌ పాయింట్లలో ఎరువులు 24 గంట ల్లో అన్‌లోడ్‌ అయ్యేలా ఏర్పాట్లుచేయాల న్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ఏప్రిల్‌ వాటా 35 వేల టన్నులు, మే వాటా 1.6 లక్షల టన్నుల యూరియాను వెంటనే తీసుకురావాలని ఆదేశించారు. 6.3లక్షల టన్ను ల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, మే వరకు 3 లక్షల టన్నుల యూరియా, లక్ష టన్నుల ఇతర ఎరువులు బఫర్‌ నిల్వల కింద అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


logo