శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 00:24:39

బీసీలకు కేంద్రం చేసిందేమీ లేదు

బీసీలకు కేంద్రం చేసిందేమీ లేదు

  • l బీజేపీ నేత లక్ష్మణ్‌  అబద్ధాలు మానుకోవాలి
  • l ఎమ్మెల్యే జోగు రామన్న 

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశ ప్రధానిగా బీసీ ఉన్నా, ఆరున్నరేండ్లలో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం చేసిందేమీ లేదని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న విమర్శించారు. బుధవారం ఆయన ఆదిలాబాద్‌లో మీడియా తో మాట్లాడారు. బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో బీసీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని, వివిధ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు లక్ష్మణ్‌కు లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని లక్ష్మణ్‌కు సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 2019-20 బడ్జెట్‌లో రూ.4,300 కోట్లు, ఈ సారి బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లను కేటాయించినట్లు గుర్తుచేశారు.