మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 02:11:02

మాస్కును మించిన వ్యాక్సిన్‌ లేదు

మాస్కును మించిన వ్యాక్సిన్‌ లేదు

  • టీకా పడేదాకా జాగ్రత్త!
  • శానిటైజర్‌, భౌతికదూరం పాటించాల్సిందే
  • వ్యాధి లక్షణాలుంటే పరీక్ష చేయించుకోవాలి
  • నగరవాసులకు సూచనలు

హైదరాబాద్‌, జనవరి 5(నమస్తే తెలంగాణ): ఒంటిపై టీకా పడేవరకూ కరోనా విషయంలో అలసత్వం పనికిరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతరరాష్ర్టాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ నిర్లక్ష్యం పనికిరాదని పేర్కొంటున్నా రు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న సమయంలో జాగ్రత్తలు పాటిస్తున్న ప్రజలు.. ఆ తర్వాత లైట్‌ తీసుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధ రించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, భౌతిక దూరం పాటించడం.. ఈ చిన్నజాగ్రత్తలు పాటిస్తే చాలు మహమ్మారి నుంచి త ప్పించుకోవచ్చు. కానీ కొందరు ఈ జాగ్రత్తలు తీసుకోవటాన్ని భారంగా భావిస్తున్నారు. దీనికితోడు లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చే యించుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నా రు. ఈ క్రమంలో కొవిడ్‌ ముదరడంతోపాటు ఇతరులకు వ్యాపిస్తున్నది. వైరస్‌ సోకుతున్న వారిలో 21 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఉండగా, ప్రాణాలు కోల్పోతున్న వారిలో అధికంగా 60 ఏండ్లు దాటిన వారుంటున్నారు. కొందరి నిర్లక్ష్యం దీర్ఘకాలిక రోగులు, వయోవృద్ధులకు శాపంగా మారుతున్నది. దాదాపు 70శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా వైరస్‌కు వాహకులుగా మారి ఇతరులకు అంటిస్తున్నారు. 

నిర్లక్ష్యం తగదు

కరోనా నాకురాదు.. వచ్చినా నన్నేం చేయ దు.. అనే ఆలోచన వద్దని, అమెరికా, ఐరోపా దేశాలు రెండో దశ వైరస్‌ విస్తరణతో అతలాకుతలమవుతున్న విషయాన్ని మరువరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘కరోనా వైరస్‌ కు రెక్కలు లేవు.. కాబట్టి ఎగురలేదు. కాళ్లు లేవు కాబట్టి నడవలేదు. మనకు మనం వెళ్లి వైరస్‌ను అంటించుకోవటమే తప్ప, వైరస్‌ మన వద్దకు దానికదేరాదు. అందుకే మాస్కు లు ధరించడం ఎట్టి పరిస్థితుల్లో మరచిపోవద్దు. చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, భౌ తికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఒకవేళ జ్వరం, దగ్గు, జలుబువంటి వైరస్‌ లక్షణాలు కనిపిస్తే, వెంటనే  పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్‌ నిర్ధారణ అయితే సొంత వైద్యానికి స్వస్తి చెప్పి, వైద్యులను సంప్రదించాలి. తద్వారా తమను తాము రక్షించుకోవడంతోపాటు తమకుటుంబాన్ని, సమాజాన్ని కాపాడినవారవుతారు’ అని నిపుణులు సూచిస్తున్నారు.

మెట్రో నగరాల్లో 30శాతం మందికే భయం

మెట్రో నగరాల్లో  కరోనా వైరస్‌ గురించి భయపడేవారు 30శాతం మాత్రమే ఉన్నారని ‘అంటారా’ సంస్థ సర్వేలో వెల్లడైంది. మిగతావారు కరోనా గురించి పట్టించుకోవటం లేదని, జాగ్రత్తలు పాటించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్పష్టమైంది. ఉత్తర, పశ్చిమ భారతంలోని మెట్రో నగరాల్లో సర్వే నిర్వహించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వల్ల సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతున్నట్లు స్పష్టమైంది. విద్య, ఉద్యోగం, ఉపాధి తదితర కారణాల వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడం, ఈ క్రమంలో కొవిడ్‌ జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమాజానికి నష్టం జరుగుతున్నట్టు సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. 

ప్రమాదం తొలగిపోలేదు

చాలామంది మాస్కులు లేకుం డా కనిపిస్తున్నారు. శుభకార్యాలు, సమావేశాల్లో భౌతికదూరం పా టించడం లేదు. కేసులు కొద్దిగా తగ్గగానే ప్రమాదం మొత్తం తొలగిపోయినట్లు భావిస్తున్నారు. పక్కాగా జా గ్రత్తలు పాటించాలి. ప్రమాదం ఇంకా తొలగిపోలేదు

-డాక్టర్‌ నాగేందర్‌, ఉస్మానియా సూపరింటెండెంట్‌

వైద్యుల సూచనలను పాటించాలి

వ్యాక్సిన్‌ రావటం సంతోషక రం. అయితే దానిని వేసుకొనే దాకా మాస్కుధరించడం మంచిది. కొవిడ్‌ సోకి లక్షణాలు లేనివారు, వారికి తెలియకుండానే ఇతరులకు  అంటిస్తున్నారు. వైరస్‌ సోకినవారు సొంతం గా కాకుండా వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలి. 

- డాక్టర్‌ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌

జాగ్రత్తలు మరువద్దు

దేశంలో డీసీజీఐ అనుమతిచ్చిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండూ సురక్షితమేనని నా అభిప్రాయం. వ్యాక్సిన్‌ తీసుకోవటం తప్పనిసరి. హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందుతుం ది. దీనివల్ల వైరస్‌ వ్యాప్తిఆగిపోతుంది. వ్యాక్సిన్‌ వచ్చిందని జాగ్రత్తలు పాటించడం మరువొద్దు. 

- డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌, ఏషియన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ


logo