బుధవారం 03 జూన్ 2020
Telangana - May 15, 2020 , 17:35:26

స్వీయ నియంత్ర‌ణ‌కు మించిన మందు లేదు

 స్వీయ నియంత్ర‌ణ‌కు మించిన మందు లేదు

మ‌హ‌బూబాబాద్: క్ర‌మ‌శిక్ష‌ణ‌తో లాక్ డౌన్ ని పాటించి క‌రోనా ని క‌ట్ట‌డి చేద్దాంమని పంచాయ‌తీరాజ్, శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మంత్రి మ‌హ‌బూబాబాద్ జిల్లా, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని తొర్రూరు లో, తొర్రూరు మండ‌లం జ‌మ‌స్థాన్ పూర్ లో ప‌లువురు దాత‌ల స‌హ‌కారంతో అందిస్తున్న నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను నిరుపేద‌ల‌కు పంపిణీ చేశారు. అలాగే అమ్మాపురం గ్రామంలో మ‌హ‌రాష్ట్ర‌కు చెందిన వ‌ల‌స కూలీల‌ను ప‌రామ‌ర్శించారు. వారిని క‌రోనా స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ,  క‌రోనాని ఎదుర్కోవ‌డంలో ప్ర‌పంచంలోని దేశాల‌కంటే, మ‌న దేశంలోని రాష్ట్రాల‌కంటే కూడా ఎంతో సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు సీఎం కేసీఆర్ తీసుకున్నార‌న్నారు. క లాక్ డౌన్ వ‌ల్ల క‌రోనా వైర‌స్ కూడా క‌ట్ట‌డిలోనే ఉంద‌న్నారు. అయితే, ప్ర‌జ‌లు మ‌రింత క‌ట్టుదిట్టంగా క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌య‌త్నించాల‌ని, లాక్ డౌన్ ని క‌ఠినంగా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. పేద‌ల‌ను ఆదుకుంటున్న దాత‌ల‌ను మంత్రి అభినందించారు.


 


logo