రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు

- చనిపోయిన కోళ్లను పరీక్షించాం.. అన్నీ నెగెటివ్
- సోషల్‌మీడియాలో దుష్ప్రచారం
- ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రులు తలసాని, ఈటల
హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదని.. ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఆనవాళ్లు చిక్కలేదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కే భవన్లో పౌల్ట్రీ ఇండస్ట్రీ ప్రతినిధులు, నిపుణులు, వైద్య, పశువైద్యశాఖ అధికారులతో బీఆర్కే భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా 1300 ర్యాపిడ్ రెస్పాన్ టీమ్స్ పని చేస్తున్నాయని, సరిహద్దు జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో కోళ్లు మృతిచెందిన విషయం తెలియగానే వైద్యబృందాలు 270 నమూనాలను పరీక్షించగా.. అన్నీ నెగెటివ్ రిపోర్టు వచ్చినట్లు చెప్పారు.
చికెన్, గుడ్లలో అధిక ప్రొటీన్లు
రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూతో ఎలాంటి నష్టం జరుగలేదని మంత్రి ఈటల తెలిపారు. శరీరానికి అధిక ప్రొటీన్లు అందించే శక్తి చికెన్, గుడ్లకే ఉందని పేర్కొన్నారు. ఉడికించిన చికెన్, గుడ్లతో ఏ సమస్య ఉండదని అన్నారు. సమీక్షలో ఎంపీ రంజిత్‌రెడ్డి, పశు సంవర్ధకశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ శ్రీనివాసరావు, పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, జేడీ రాంచందర్, బ్రీడర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఎన్ఈసీసీ సీఈవో కేజీ ఆనం ద్, పౌల్ట్రీ ఫెడరేషన్ మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాఘవరావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎఫ్3లో మరో మెగా హీరో సందడి..?
- వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు కోరుతూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
- అయ్య రిటైర్మెంట్.. బిడ్డ ఎంగేజ్మెంట్..!
- అన్నదాతకు కన్నీరు రాకుండా చూస్తున్న సీఎం కేసీఆర్
- బైడెన్ ఫస్ట్ డే.. డబ్ల్యూహెచ్‌వోలో చేరనున్న అమెరికా
- మాస్క్ ధరించని విదేశీయులతో పుష్ అప్స్
- ‘మాస్టర్’ వీడియో లీక్..నిర్మాత లీగల్ నోటీసులు
- కమలా హ్యారిస్.. కొన్ని ఆసక్తికర విషయాలు
- రోడ్డు ఊడ్చిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్
- సారీ చెప్పిన సల్మాన్..ఎగ్జిబిటర్లకు గుడ్‌న్యూస్