శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 00:57:34

వ్యాక్సిన్‌కు మూడు గీటురాళ్లు

వ్యాక్సిన్‌కు మూడు గీటురాళ్లు

వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తున్నదో లేదో తెలుసుకునేందుకు 3 రకాలుగా విశ్లేషిస్తారు.

భద్రత: వ్యాక్సిన్‌ ప్రయోగించాకా 2 వారాల్లో దుష్ప్రభావాలు కనిపించకపోతే అది భద్రమేనని నిర్ధారిస్తారు. 

సామర్థ్యం: వ్యాక్సిన్‌ ప్రయోగించిన రెండుమూడు రోజులకే రక్తంలోని ‘టీ కణాలు’ యాక్టివేట్‌ అవుతున్నాయో లేదో చూస్తారు. 14 రోజుల తర్వాత వైరస్‌ను చంపే ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయ్యాయో లేదో పరిశీలిస్తారు. వైరస్‌కు చెందిన ఒక రూపం ఆధారంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు. కరోనాకు ఇప్పటివరకు సుమారు 1500 రూపాలు ఉన్నాయి. వాటిపై వ్యాక్సిన్‌ పనితీరును ఫేజ్‌-2, ఫేజ్‌-3లో పరీక్షిస్తారు. అన్నింటిపైనా పోరాడే ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయితే ఆ టీకా సమర్థవంతమైనది.

స్థిరత్వం: ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3లో అన్ని వయసుల వలంటీర్లలో తగిన సంఖ్యలో ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయగలగాలి. అదే సమయంలో మన శరీరానికి హాని కలిగించే ‘కో ఇన్‌ఫ్లమేటరీ సైటోకైనిన్‌'లు ఉత్పత్తి కాకుండా అడ్డుకోవాలి.

మూడు విఘ్నాలు దాటితేనే..ప్రతి దశలో వ్యాక్సిన్‌ పనితీరును ఢిల్లీలోని సెంట్రల్‌ బోర్డు విశ్లేషిస్తుంది. మూడు దశల్లో విజయవంతం అయ్యాక అన్ని కోణాల్లో పరిశీలించి,  మార్కెట్‌లోకి విడుదలకు అనుమతులు ఇస్తుంది.logo