గురువారం 28 మే 2020
Telangana - May 13, 2020 , 01:37:29

రైస్‌ మిల్లులకు మహర్దశ

రైస్‌ మిల్లులకు మహర్దశ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణవ్యాప్తంగా మొత్తం 2,400 రైస్‌ మిల్లులు ఉండగా, ప్రస్తుతం 2,200 మిల్లులు పని చేస్తున్నాయి. వీటి మొత్తం సామర్థ్యం ఏడాదికి కోటి టన్నులు. అంతమేర మిల్లింగ్‌ చేసేంత దిగుబడి మాత్రం ఉండేది కాదు. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావటంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దీనికితోడు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వడంతో రైస్‌మిల్లులకు మహర్దశ వచ్చింది. ఈ మేరకు కొన్నిరోజుల కిందట సీఎం కేసీఆర్‌ రైస్‌మిల్లుల యజమానులకు పిలుపు కూడా ఇచ్చారు. పూర్తిస్థాయి సామర్థ్యం మేర మిల్లింగ్‌కు సిద్ధం కావాలని సూచించిన విషయం తెలిసిందే.


logo