ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 28, 2021 , 20:11:49

పార్టీ మార్పు ప్ర‌చారాన్ని ఖండించిన తేరా చిన్న‌ప‌రెడ్డి

పార్టీ మార్పు ప్ర‌చారాన్ని ఖండించిన తేరా చిన్న‌ప‌రెడ్డి

హైద‌రాబాద్ : తాను పార్టీ మారుతానని ప్రసార సాధనాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తీవ్రంగా ఖండించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహాయ్య అకాల మ‌ర‌ణంతో నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉపఎన్నిక వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సాగ‌ర్ ఉపఎన్నిక స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మౌతుంది. ఈ క్ర‌మంలో భాగంగా నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ నేత‌, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్న‌ప‌రెడ్డి పార్టీ మార‌బోతున్నార‌ని అస‌త్య ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. దీనిపై ఆయ‌న స్పందిస్తూ పార్టీ మారుతార‌నే ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండించారు. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాద‌న్నారు. త‌మ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్‌కు విధేయుడిన‌న్నారు. ఎమ్మెల్సీగా త‌న ప‌ద‌వీకాలం ఇంకో ఏడాది ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

VIDEOS

logo