శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 24, 2020 , 01:51:37

కాల్వలో దూకి.. మహిళ ప్రాణం నిలిపి

కాల్వలో దూకి.. మహిళ ప్రాణం నిలిపి
  • కాకతీయ కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను రక్షించిన యువకుడు

మెండోరా: ప్రమాదవశాత్తు కాల్వలో పడి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ మహిళను ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా శివారులో నివసిస్తున్న నాగమణి కుటుంబం పరికరాలు సానబడుతూ జీవిస్తున్నది.  ఆదివారం కాకతీయ కాల్వలో నీటి కోసం దిగిన నాగమణి ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడింది. నీటిలో కొట్టుకుపోతున్న నాగమణిని చూసి గ్రామస్థులు కేకలు వేయగా, అక్కడే ఉన్న దేవరాజ్‌  కాల్వలోకి దూకి మహిళను ఒడ్డుకు తీసుకువచ్చాడు. స్పృహ కోల్పోయిన నాగమణిని బాల్కొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రాణాలకు తెగించి మహిళ ప్రాణాలు కాపాడిన దేవరాజ్‌ను గ్రామస్థులు అభినందించారు. logo