బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 02:17:25

తీవ్రంగా కొట్టి..బావిలో పడేసి..

తీవ్రంగా కొట్టి..బావిలో పడేసి..

చెల్లిని ప్రేమిస్తున్నాడని యువతి సోదరుల దారుణం

ప్రాణాలతో బయటపడ్డ యువకుడు

కొండపాక: తమ చెల్లిని ప్రేమిస్తున్న ఓ యువకుడిని ఆమె సోదరులు తీవ్రంగా కొట్టి బావిలో పడేసిన ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బంధారం లో బుధవారం చోటుచేసుకున్నది. కుకునూర్‌పల్లి ఎస్సై పరమేశ్వర్‌ తెలిపిన వివరాలు ప్రకారం.. మద్దూరు మండలం నర్సాయపల్లెకి చెందిన బింగి శ్రీకాంత్‌ అదేగ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె సోదరులు పథకం ప్రకారం మంగళవారం చెల్లెలి మొబైల్‌ నుంచి శ్రీకాంత్‌కు మెస్సేజ్‌ పంపి చేర్యాలకు రప్పించారు. అక్కడికి వెళ్లిన శ్రీకాంత్‌పై యువతి సోదరులు బాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి దాడిచేసి తీవ్రం గా కొట్టి కారులో తీసుకెళ్లి బంధారం శివారులోని ఓ వ్యవసాయ బావిలో పడేశారు. ఆ యువకుడు తీవ్రగాయాలతో రాత్రంతా బావిలోనే గడిపాడు. బుధవారం సాయంత్రం యువకుని అరుపులు విన్న మేకల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని యువకున్ని బయటకు తీసి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. యువతి సోదరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్‌ తెలిపారు.


logo