ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 08:42:59

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్‌ :  నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ ఫేజు- 3లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్న దుర్గ(21) అనే యువకుడు...అర్థరాత్రి ఇంట్లోని కిటికీ గ్రిల్స్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుర్గ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.