బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 13:44:36

మహిళ కడుపులో 6 కిలోల కణితి

మహిళ కడుపులో 6 కిలోల కణితి

కరీంనగర్‌ : ఓ మహిళ కడుపులో ఆరు కిలోల కణితిని గుర్తించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ఈ ఘటన జిల్లాలోని హుజురాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్‌ మండల పరిధిలోని జాగీర్‌పల్లికి చెందిన వనిత(30) అనే మహిళకు నిన్న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్‌ శ్రీకాంత్‌ రెడ్డి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. 24 గంటల్లో ఆపరేషన్‌ చేయకపోతే కష్టమని వనితకు వైద్యులు సూచించారు.

ఆపరేషన్‌కు జిల్లా వైద్య శాఖ అధికారి అనుమతి కావాలని బాధితురాలికి వైద్యులు సూచించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు.. జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత అనుమతి తీసుకున్నారు. అనంతరం వనితకు వైద్యులు గంటపాటు శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. కణితి బరువు ఆరు కిలోలు ఉందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం వనిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు. వనితకు భర్త, ఒక బిడ్డ ఉన్నారు. 


logo