శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 19:34:37

రెవెన్యూ అధికారుల బూతు పురాణం

రెవెన్యూ అధికారుల బూతు పురాణం

జోగులాంబ గద్వాల : జిల్లాలోని మల్దకల్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో సర్వేయర్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ మధ్యలో బండ బూతులతో వాగ్వాదం జరిగింది. సర్వేయర్ మెడికల్ బిల్లులు అప్రూవ్‌ చేయడం లేదని సీనియర్ అసిస్టెంట్‌తో గొడవకు దిగాడు. పరస్పరం రాయలేని రీతిలో దూషించుకున్నారు. కాగా వీరి  గొడవ తాలూకు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇద్దరు ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు అందిస్తామని తహసీల్దార్ ఈ సందర్భంగా తెలిపారు.