గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 19:33:14

రాష్ట్ర ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : రాష్ట్రంలో స‌బ్బండ వర్ణాలకు స‌మ న్యాయం అందించే దిశ‌గా సీఎం కేసీఆర్ ప‌ని చేస్తున్నార‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. జిల్లాలోని పాల‌కుర్తి చెరువులో చేపలు వదిలిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపలు పట్టడానికి కూడా ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌న చెరువుల్లోకి వ‌చ్చేవార‌న్నారు. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత సీఎం కేసీఆర్ ఈ ప‌రిస్థితుల నుంచి మార్పును తీసుకొచ్చారు. 

మ‌న మన జాలరుల చేత చెరువుల్లో చేప పిల్లలు ఉచితంగా వేస్తూ, వారికి చేతినిండా ప‌ని క‌ల్పిస్తు‌న్నార‌న్నారు. అంతరించి పోతున్న కుల వృత్తుల‌కు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే మ‌ళ్లీ ఆద‌ర‌ణ ప్రారంభ‌మైంద‌న్నారు. ఇత‌ర‌త్రా అన్ని కులాల‌ను ఆదుకునే విధంగా పని చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ప్రభుత్వం క‌ల్పిస్తున్న ప‌థ‌కాల‌ను వినియోగించుకుని అభివృద్ధి సాధించాల‌ని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల‌, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


logo