సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : సింగరేణి కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, కవితను హైదరాబాద్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థ అభివృద్ధితోపాటు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు పలు వినతులను ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆరెపల్లి రాజేందర్, రాజేశ్వర్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇండియా కొత్త రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
- నో టైమ్ టు డై.. మళ్లీ వాయిదా
- చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్ఎస్ను గెలిపిద్దాం
- రుణ యాప్‌ల కేసులో మరో ముగ్గురు అరెస్టు
- మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌కి జడ్‌ప్లస్ సెక్యూరిటీ
- విషవాయువు లీక్.. ఏడుగురికి అస్వస్థత
- బిడ్డ జాడను చూపించిన ఆవు... వీడియో వైరల్...!
- ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
- దేశంలోని ప్రతి మూలకు వ్యాక్సిన్లు అందుతున్నాయి : ప్రధాని
- రీమేక్‌పైనే ఇస్మార్ట్ బ్యూటీ ఆశలు..!