బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 09:42:18

రాష్ట్రంలో విచిత్ర వాతావ‌ర‌ణం, ఓ వైపు ఎండ‌..మ‌రో వైపు వ‌ర్షం

 రాష్ట్రంలో విచిత్ర వాతావ‌ర‌ణం, ఓ వైపు ఎండ‌..మ‌రో వైపు వ‌ర్షం

రాష్ట్రంలో విచిత్ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. గ‌త వారం రోజులుగా ఓవైపు ఎండ‌, మ‌రోవైపు వ‌ర్షాలు.. రాష్ట్రంలో ఇలాంటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అప్ప‌టివ‌ర‌కు ఎండ దంచికొడుతుంటే...ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోయి చ‌ల్ల‌బ‌డి ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తున్నాయి. అటు అకాల వ‌ర్షాల‌తో ప‌లుచోట్ల చేతికొచ్చిన పంట‌లు దెబ్బ‌తింటున్నాయి. ఈదురుగాలుల‌తో మామిడిపూత‌, పిందెలు రాలిపోతుండ‌గా, ఒక్క‌సారిగా కురుసున్న కుండ‌పోత‌తో మార్కెట్ల‌లో ఉన్న ధాన్యం త‌డిసిపోతుంది. ఇక నిన్న ఆదిలాబాద్‌లో 43.3డిగ్రీల‌ అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త న‌మోదుకాగా..ఇటు వేరే జిల్లాల్లో వ‌ర్షాలు కురిశాయి. కాగా అల్ప‌పీడ‌న ద్రోణి కొన‌సాగుతున్న‌ద‌ని దీని ప్ర‌భావంతో మ‌రో రెండు రోజుల పాటు ఈదురు గాలుల‌తో కూడిన మోస్త‌రు వాన‌లు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.


logo