ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 12:51:46

అప్రమత్తతే ఆయుధం : మంత్రి సత్యవతి రాథోడ్

అప్రమత్తతే ఆయుధం : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : వానకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహబూబాబాద్ లోని మురికి కాలువల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ గౌతమ్ తో కలిసి ఆయిల్ బాల్స్ వేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో పాటు మందు లేని మహమ్మారి కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించి పరిశుభ్రంగా ఉండాలన్నారు. మహబూబాబాద్ ని సర్వాంగ సుందరంగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకుని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇందు కోసం నేతలు, అధికారులు అందరం కలిసి పని చేద్దామని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.


logo