e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home టాప్ స్టోరీస్ సాగర్‌లో గెలుపు టీఆర్‌ఎస్‌దే

సాగర్‌లో గెలుపు టీఆర్‌ఎస్‌దే

సాగర్‌లో గెలుపు టీఆర్‌ఎస్‌దే

30 ఏండ్లలో ప్రజలను పట్టించుకోని జానారెడ్డి
ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

పెద్దవూర, మార్చి 26: తెలంగాణ ప్రజల కోసమే ఉద్భవించిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రభుత్వ విప్‌, ఉప ఎన్నికల పెద్దవూర మండల ఇంచార్జి బాల్క సుమన్‌ ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని తెప్పలమడుగు, శిర్సనగండ్లలో శుక్రవారం ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి సామంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. జానారెడ్డి 30 ఏండ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా.. ఇంకా చాలామందికి తెలియదన్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన జానారెడ్డికి ఇక్కడి ప్రజల కష్టసుఖాలు ఏం తెలుసని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఇక్కడ అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయన్నారు.
భారీగా చేరికలు..
పెద్దవూర మండలం తుంగతుర్తి ఎంపీటీసీ సభ్యులు జటావత్‌ జ్యోతికృష్ణ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 200 గిరిజన కుటుంబాలతో కలిసి శుక్రవారం పెద్దవూరలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. బట్టుగూడెంలో కాంగ్రెస్‌కు చెందిన 40 మం ది గులాబీ కండువా కప్పుకొన్నారు. గుర్రంపోడు మం డలంలోని పలు గ్రామాలకు చెందిన 130 కుటుంబాల వారు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. త్రిపురారం మం డలంలోని నీలాయిగూడెం, అంజనపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌కు చెందిన 60 మంది మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ సమక్షంలో, తిరుమలగిరి మండలంలో ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, జీ సురేందర్‌ సమక్షంలో కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాల నుంచి వంద కుటుంబాల వారు టీఆర్‌ఎస్‌లో చేరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాగర్‌లో గెలుపు టీఆర్‌ఎస్‌దే

ట్రెండింగ్‌

Advertisement