శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 17:04:22

ఆపత్కాలంలో పేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ఆపత్కాలంలో పేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

మేడ్చల్‌ మల్కాజిగిరి : రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జిల్లాలోని ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డిగూడలో సోమవారం లేత చారిట్రబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వరద బాధితులకు, పేద కుటుంబాలకు చైర్‌పర్సన్‌ ముల్లి పావని ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆపద సమయాల్లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఏదో ఒక రకంగా మేలు చేయడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అర్హులందరికి పదివేల రూపాయలు వరద సహాయం ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలను వరద నష్టాన్ని ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. మిగిలిపోయిన వారికి కూడా ఆన్‌లైన్‌ ద్వారా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ పలుగుల మాధవ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌ గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంపాల సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.