మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 14:30:42

అన్నదాతకు అండగా..టీఆర్ఎస్ ప్రభుత్వం : మంత్రి నిరంజన్ రెడ్డి

అన్నదాతకు అండగా..టీఆర్ఎస్ ప్రభుత్వం : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని గోపాలపేట మండలం పోలికే పాడు గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు.  రైతులు బాగుంటేనే పల్లెల్లో నలుగురికి జీవనోపాధి దొరుకుతుందన్నారు. మూడు రోజుల్లోనే  కోటి 33 లక్షల 77వేల ఎకరాలకు సంబంధించి 54.22 లక్షల మంది రైతులకు రూ.6,888.43 కోట్ల రైతుబంధు నిధులను ఖాతాలలో జమ చేశామన్నారు.

సాగు బాగుపడాలన్న ఉద్దేశంతోనే దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతు అప్పులలో ఉండొద్దన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అందుకే కరోనా వంటి విపత్కర పరిస్థితిలోనూ రైతుబంధు నిధులు విడుదల చేసి కేసీఆర్  ప్రభుత్వ లక్ష్యాన్ని చాటారన్నారు. దండగన్న వ్యవసాయాన్ని ఆరేళ్లలో పండగ చేశాం. కరువునేల తెలంగాణను దేశానికి అన్నపూర్ణను చేశామని మంత్రి వెల్లడించారు. మనిషికో మొక్క నాటి సంరక్షించాలన్నారు.


logo