మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 13:14:20

ఇక ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌’ : మంత్రి పువ్వాడ

ఇక ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌’ : మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఖమ్మం కాలెక్టరేట్ వద్ద ఆదివారం ఆర్టీసీ ఉమెన్ బయో టాయిలెట్స్ ను మేయర్ పాపాలాల్ గారితో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌' ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. నగరాల్లో మహిళలు ఇబ్బంది పడకుండా  టాయిలెట్స్ ఆన్ వీల్స్‌  అందుబాటులో ఉంచడం వల్ల  ప్రయోజనం చేకూరుతుందన్నారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఆయన పేర్కొన్నారు.

మహిళలపై జరుగుతున్న దాడులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటుందన్నారు. కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ వంటి అనేక కార్యక్రమాల వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. నగరాల్లో మహిళలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.logo