ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 00:46:01

పొగతాగే వారికి పొంచి ఉన్న ముప్పు!

పొగతాగే వారికి పొంచి ఉన్న ముప్పు!

హైదరాబాద్‌: హృదయ, కాలేయ సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారితోపాటు ధూమపాన ప్రియులు ఎక్కువగా కరోనా బారిన పడే ముప్పు  ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగతాగే వారికి కరోనా ముప్పు ఎక్కువ అని, వారి శరీరంలో రోగనిరోధక శక్తిని అణచివేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. పొగతాగే వారిలో ఊపిరితిత్తులు, ధమనులు, గుండె, మూత్రపిండాలు, పేగులు వైరస్‌ సోకేందుకు మార్గాలని తెలిపింది. ధూమపానం మానేసిన వారితో పోలిస్తే పొగ తాగే వారిలో 1.45 రెట్లు కరోనా ముప్పు పొంచి ఉందని లండన్‌ యూనివర్సిటీ కాలేజీ అధ్యయనంలో తేలింది. 


logo