బుధవారం 27 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 18:02:59

లక్నవరంలో మూడో వంతెన రెడీ

లక్నవరంలో మూడో వంతెన రెడీ

ములుగు : పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న లక్నవరం సరస్సులో మూడో వేలాడే వంతెన రెడీ అయింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. 2వ ఐలాండ్‌ నుంచి 3వ ఐలాండ్‌ వరకు నూతనంగా నిర్మించిన ఈ వంతెన 15 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో లక్నవరం ముచ్చటగా మూడు వంతెనలతో పర్యాటకులను మరింత కనువిందు చేయనుంది. టీఎస్‌ టీడీసీ ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో లక్నవరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేస్తూ మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.


logo