సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 11:26:07

మున్సిపాలిటీల్లో 2000 మంది సిబ్బందిని నియమించనున్న తెలంగాణ ప్రభుత్వం

మున్సిపాలిటీల్లో 2000 మంది సిబ్బందిని నియమించనున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ర్టంలోని 141 మున్సిపాలిటీలకు 2000 మంది సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇంజినీరింగ్‌, టౌన్ ప్లానింగ్, అనేక మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు వంటి విభాగాల్లో సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై కేటీఆర్‌ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో సమావేశమై ఖాళీల నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ నియామకాలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇంతకుముందు ప్రభుత్వం 70 కొత్త మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీలో ఒక పర్యావరణ ఇంజినీర్‌ను నియమించాలనే ప్రతిపాదన కూడా ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo