శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 12:28:32

తెలంగాణ సమాజం ఒక గొప్ప నేతను కోల్పోయింది

తెలంగాణ సమాజం ఒక గొప్ప నేతను కోల్పోయింది

హైదరాబాద్‌ : కార్మికుల గొంతుక, పేదల చేయూత, తెలంగాణ తొలి, మలి ఉద్యమాల నేత,  రాష్ట్ర తొలి హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి బాధాకరమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నరసింహారెడ్డి పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ..నాయిని మృతితో తెలంగాణ సమాజం, టీఆర్ఎస్ ఒక గొప్ప నాయకున్ని కోల్పోయిందన్నారు. తమకు నిత్యం ధైర్యంగా నిలబడే నేతను కోల్పోయామని ఆమె బాధను వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.