శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 13:58:17

సర్వేను పారదర్శకంగా చేపట్టాలి : ఎమ్మెల్యే కిషోర్ కుమార్

సర్వేను పారదర్శకంగా చేపట్టాలి : ఎమ్మెల్యే కిషోర్ కుమార్

యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం సర్వేను పారదర్శకంగా చేపట్టాలని తుంగతుర్తి ఎమ్మెల్చే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.  మోత్కూరు మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీలో పర్యటించి కాలనీలోని ఇండ్ల వివరాలు అడిగి తెలుసుకుని సర్వే పారదర్శకంగా చేయాలని అధికారులకు సూచించారు. కాలనీలో ఉన్నటువంటి ఇండ్లను రూపాయి ఖర్చు లేకుండా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికల్ల కాలనీలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు వేస్తామని అన్నారు.

మోత్కూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని భుజిలపురంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే  సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి, జెడ్పీటీసీ గోరుపల్లి శారద, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, వైస్ ఎంపీపీ భూశిపాక లక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబొయిన రమేష్, తదితరులు పాల్గొన్నారు.


logo