బుధవారం 03 జూన్ 2020
Telangana - May 14, 2020 , 13:46:52

ఇద్దరు న్యూడెమోక్రసీ మావోయిస్టుల లొంగుబాటు

ఇద్దరు న్యూడెమోక్రసీ మావోయిస్టుల లొంగుబాటు

వరంగల్ అర్బన్ : నిషేధిత న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమ భాస్కర్ అలియాస్ సూర్యం, మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు బర్క ప్రతాప్ అలియాస్ శ్యామ్ వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ఎదుట లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో లొంగిపోయినట్లు వారు తెలిపారు. వీరిపై పలు పోలీస్టేన్ లలో కేసులు నమోదై ఉన్నాయి. శ్యామ్ స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కొత్త గూడెం మండలం కాగా, సూర్యం స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి.


logo