గురువారం 04 జూన్ 2020
Telangana - May 11, 2020 , 12:47:08

మావోయిస్టు పార్టీ దళ సభ్యుడి లొంగుబాటు

మావోయిస్టు పార్టీ దళ సభ్యుడి లొంగుబాటు

హైదరాబాద్‌ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పెట్టి అయితు అలియాస్ అయితడు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2014 ఆగస్టు నెలలో భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు పార్టీ దళం సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై దళ కమాండర్ సంతోష్ ఆదేశాల మేరకు దళ సభ్యుడిగా చేరి అజ్ఞాతవాసం లోకి వెళ్లినట్లు తెలిపారు. ఆరోగ్యం సహకరించని కారణంగా తన చిన్నాన్న సహాయంతో పోలీసులకు లొంగి పోయినట్లు ఎస్పీ వెల్లడించారు. 


logo