శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 20:05:03

సూరమ్మ ప్రాజెక్ట్‌ను గోదావరి జలాలతో నింపుతాం

 సూరమ్మ ప్రాజెక్ట్‌ను గోదావరి జలాలతో నింపుతాం

కరీంనగర్‌ : జిల్లాలోని సూరమ్మ ప్రాజెక్టును గోదావరి జలాలతో నింపుతామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కథలాపూర్‌ మండలం ఇప్పపల్లిలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ..సూరమ్మ ప్రాజెక్టును నీటితో నింపే విధానంపై నీటి పారుదల శాఖ అధికారులతో 15 రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను తయారు చేయిస్తామన్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

ప్రాజెక్టు ఆయకట్టు కింద మొత్తం 67 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. సమావేశం అనంతరం సూరమ్మ ప్రాజెక్టును వినోద్‌కుమార్‌ పరిశీలించారు. కార్యక్రమంలో ఈఎన్సీ అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ రవి, జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి తదితరులుపాల్గొన్నారు.